StoryWeaver లో కథలను అనువదించడం ఎలా? – StoryWeaver Part 2

StoryWeaver – సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్ Part 2
మొదటి భాగం లో మనం StoryWeaver వెబ్సైట్ లో ఏమేముంటాయి, వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ,కథలను చదవడం లో ఏమేమున్నాయి, కథలను ఆఫ్ లైన్ లో చదవడానికి ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే బుక్ షెల్ఫ్ లో పుస్తకాలను ఎలా చేర్చుకోవాలి మొదలైన అంశాలను గురించి నేర్చుకున్నాము.
మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ భాగం వీడియో పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ భాగం లో వెబ్సైట్ లోని రెండవ అంశం “Translate” గురించి నేర్చుకుందాం.
లాగిన్ అయిన తర్వాత మనకు ముఖ్యంగా 4 అంశాలు కనిపిస్తాయి
1. Read : కథ లను చదవడం
2. Translate :కథ లను అనువదించడం
3. Create : కొత్త కథ తయారు చేయడం
4. Resources : వెబ్సైట్ లోని వనరులు
ఇందులో రెండవ అంశం అయినటువంటి TRANSLATE క్లిక్ చేసినప్పుడు
ఈ క్రింది విండో వస్తుంది,
అందులో TO దగ్గర మనం ఏ భాష లోకి అనువాదించాలనుకుంటున్నామో ఆ భాష ఎంచుకోవాలి
మనం అనువాదించాలనుకున్న భాష ఎంచుకోగానే,
ఈ క్రింది విధంగా ఏ ఏ కథలైతే ఆ భాషలోకి అనువదించాల్సిన అవసరం ఉందో అవి మాత్రమే కనిపిస్తాయి
ఇందులో అనువాదించాలనుకున్న కథ పై TRANSLATE బటన్ క్లిక్ చేయాలి.
ఇప్పుడు వచ్చే విండో లో ముందుగా టైటిల్ పై క్లిక్ చేసి అది మార్చుకోవాలి
ఇందులో Title of your Translation దగ్గర : మన భాషలో పేరు ఇవ్వాలి
ఉదాహరణ కు : అనగనగా ఒక రాజు
Your tile in English script దగ్గర పేరు ను ఆంగ్ల అక్షరాలలో మన బాషలోనే రాయాలి
ఉదాహరణ కు : anaganagaa oka raju
ఈ విధంగా ఇచ్చి సేవ్ చేయాలి.
ఇప్పుడు వచ్చే విండో లో
ఎడమ వైపు ఆంగ్లం లో ఉంటుంది,
కుడి వైపు మనం అనువాదించాలనుకున్న భాష ఉంటుంది
ఎడమ వైపు ఉన్న కథ లోని పడాలపై క్లిక్ చేసినప్పుడు దాని అర్థం తో పాటు డిక్షనరీ ఓపెన్ అవుతుంది
మనం ఎడమ వైపున్న దానికి మన భాష లో అనువాదం కుడి వైపు ఉన్న బాక్స్ లో టైప్ చేయాలి
ఇది టైప్ చేయడానికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఏదీ అవసరం లేదు, మనం ఆంగ్లం లో టైప్ చేస్తుంటే మన భాషలో అది వస్తుంది
ఉదాహరణ కు : మనం కల్పన అని టైప్ చేయాలంటే kalpana అని టైప్ చేస్తే సరిపోతుంది.
ఈ విధంగా టైప్ చేశాక, క్రింద Next బటన్ ని క్లిక్ చేసి తర్వాత పేజీ కీ వెళ్ళవచ్చు
ఈ విధంగా మొత్తం అనువాదం టైప్ చేశాక పైన Publish బటన్ క్లిక్ చేస్తే మన కథ అనువదించిన భాషలో కి అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది
సగం కథ అనువదించిన తర్వాత మధ్యలో ఆపి తర్వాత చేయాలనుకుంటే Save బటన్ క్లిక్ చేయాలి.
మళ్ళీ మన Dashboard లోకి వెళ్ళి ఆ కథ ను ఎడిట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా అనువాదం చేసిన కథలు మనకు కొత్త భాషలో వచ్చేస్తాయి
ఈ ఆర్టికల్ లో Translate గురించి చెప్పుకున్నాము, తర్వాతి భాగం లో
3. Create : కొత్త కథ తయారు చేయడం
4. Resources : వెబ్సైట్ లోని వనరులు
లను గురించి తెలుసుకుందాం
అన్నీ భాగాల పూర్తి వీడియో చూడండి
Recent Posts
- Online Test Creator
- LearningApps -How to type Mathematical Equations & Expressions.. (Learning Apps Part 3)
- LearningApps -మ్యాప్ పాయింటింగ్ ఆప్ తయారు చేయడం .. (Learning Apps Part 2)
- LearningApps – ఇంటరాక్టివ్ టెస్ట్ ఆప్స్ ని సులభంగా తయారు చేసుకోండి ఇలా.. (Learning Apps Part 1)
- StoryWeaver లో కొత్త కథలను తయారు (Create) చేయడం ఎలా? – StoryWeaver Part3
Recent Comments