కథలు అల్లుదామా! StoryWeaver – సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్ – Part 1

StoryWeaver తో కథలు అల్లుదామా!
సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్
హాయ్ ఫ్రెండ్స్ టీచర్స్ కు ఉపయోగపడే రకరకాల టూల్స్ ని వెబ్ సైట్ నీ పరిచయం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన టువంటి ఎడిషన్లలో మొదటి భాగంలో ఒక అద్భుతమైనటువంటి వెబ్సైట్ గురించి చెబుతున్నాను.
పూర్తి వీడియో పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ వెబ్సైట్ storyweaver.org.in
అనేక రకాల కథలు చదవడానికి, అలాగే ఉన్నటు వంటి కథలు మన భాషలోకి అనువదించడానికి, కొత్త కథలు తయారు చేయడానికి వివిధ స్థాయిల విద్యార్థులకు వారి స్థాయి కీ తగ్గ కథలను అందుబాటులో ఉంచడానికి ఇది ఒక అద్భుతమైన టూల్ గా ఉంటుంది.
ఈ వెబ్సైట్ లో
ఏ విధంగా మనం కొత్త కథలు తయారు చేసుకోవచ్చు లేదా ఉన్నటువంటి కథలను ఎలా షేర్ చేసుకోవచ్చు, ఎలా మన భాషలోకి అనువాదించుకోవచ్చు? అసలు ఈ వెబ్సైట్ ని ఎలా ఉపయోగించాలి అనే విషయం కూడా ఈ రోజు మనం నేర్చుకుందాం.
ఇందులో దాదాపు 33 వేలకు పైగా కథలు అందుబాటులో ఉన్నాయి,అలాగే వేర్వేరు భాషల్లో కూడా మనకి ఇందులో కథలుంటాయి ఆ తర్వాత వేరే స్థాయిలకు అనుగుణంగా ఈ విధంగా రకరకాల స్థాయిలో కూడా కథలున్నాయి
అయితే ఈ వెబ్సైట్ లోని కథలను చదవాలన్నా, అనువాదించాలన్నా లేదా కొత్త కథలను తయారు చేసుకోవాలన్నా మనం ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి ఉండాల్సి వస్తుంది,
అందుకోసం మనం మన మెయిల్ ఐడి తో సైన్ అప్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ ఉన్న జీమెయిల్ తో లేదా ఫేస్బుక్ అకౌంట్ తో లాగిన్ అవచ్చు,
ఇది పూర్తిగా ఉచిత వెబ్సైట్ – అయితే మీరు ఈ వెబ్సైట్ కి రెండు రకాలుగా సహాయం చేయవచ్చు.
1. వెబ్సైట్ లో కథలు తయారు చేయడం లేదా అనువదించడం
2. Donate బటన్ క్లిక్ చేసి మనకు తోచినంత అమౌంట్ డొనేట్ చేయడం ద్వారా.
ఇప్పుడు ఈ భాగం లో, ఒక్కొక్కటి గా ఇందులోని ఫీచర్స్ ని తెలుసుకుందాం
ముందుగా సైన్ అప్ / సైన్ ఇన్ చూద్దాం :
వెబ్సైట్ ఓపెన్ చేయగానే
మెయిన్ పేజీ లో కుడివైపున Sign Up/ Log in అని బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి
ఇప్పుడు వచ్చే విండో లో మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి
- మెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకోవడం
- ఆల్రెడీ ఉన్న
-
- జీమెయిల్ అకౌంట్ లేదా
- ఫేస్బుక్ అకౌంట్ లేదా
- ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవడం
మొదటి విధానంలో :
మెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకోవడం కోసం మన మెయిల్ ఐడి ఇచ్చి Next-> క్లిక్ చేసిన తర్వాత
మన మెయిల్ కి వచ్చిన సూచనలను పాటించి, Password ఎంటర్ చేసి Login క్లిక్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
రెండవ విధానంలో :
Facebook లేదా Google లేదా Mobile బటన్ క్లిక్ చేయాలి
Facebook క్లిక్ చేసినప్పుడు వచ్చే విండోలో Facebook అకౌంట్ వివరాలతో లాగిన్ అవాలి
Google క్లిక్ చేసినప్పుడు వచ్చే విండోలో Gmail అకౌంట్ వివరాలతో లాగిన్ అవాలి
Mobile క్లిక్ చేసినప్పుడు వచ్చే విండోలో Mobile Number ఇచ్చి ఆ తర్వాత వచ్చే OTP ఎంటర్ చేసి లాగిన్ అవాలి
లాగిన్ అయిన తర్వాత మనకు ముఖ్యంగా 4 అంశాలు కనిపిస్తాయి
1. Read : కథ లను చదవడం
2. Translate :కథ లను అనువదించడం
3. Create : కొత్త కథ తయారు చేయడం
4. Resources : వెబ్సైట్ లోని వనరులు
1. Read ( కథ లను చదవడం) : ఈ వెబ్సైట్ లో అప్పటికే ఉన్న కథలను చదవాలంటే Read ని క్లిక్ చేయాలి
ఇది క్లిక్ చేసిన తర్వాత
కథలను ఎంచుకోడానికి మనకు 4 అవకాశాలు లు ఉంటాయి
Trending Themes ఈ ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా కథలను వాటి విషయాన్ని ఆధారంగా ఎంచుకోవచ్చు
Trending Languages ఈ ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా కథలను వాటి భాష ఆధారంగా ఎంచుకోవచ్చు
Explore Books ఈ ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా కథలను అవి ఎవరికి సరిపోతాయో ఆ స్థాయిని బట్టి ఎంచుకోవచ్చు
Explore Formats ఈ ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా కథలను అవి ఏ ఫార్మాట్ లో అంటే Readalong అంటే కథ చదివి వినిపించే ఫార్మాట్ లేదా Video లేదా GIF ఫార్మాట్లను ఎంచుకోవచ్చు
అయితే ఈ వెబ్సైట్ లో ఉన్నటువంటి కథలు పిల్లలకి షేర్ చేసి రీడింగ్ అలవాటు చేయొచ్చు , తర్వాత వేరే భాషలో ఉన్న కథలను కూడా మన భాషకి అనువాదం చేయవచ్చు, అలాగే మనం సొంతగా చిన్న చిన్న కథలను అందమైన చిత్రాలతో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, అలాగే మనం తయారు చేసిన కథలను కూడా వేరే వాళ్ళు అనువాదం చేయవచ్చు.
పై విధంగా విషయం ఆధారం గా లేదా భాష ఆధారం గా ఎన్నుకున్న తర్వాత
మనకు కావాల్సిన కథ పైకి మౌస్ తీసుకెల్లగానే QUICKVIEW అనే బటన్ కనిపిస్తుంది,దాని ప్రక్కన ఉన్న ౩ చుక్కలను క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది
ఇందులో మనకు కన్పించే మూడు అంశాలు చూసినట్లయితే ,
Read Story : ఇది క్లిక్ చేస్తే
కథని చదవడానికి విండో ఓపెన్ అవుతుంది
My BookShelf: ఇది క్లిక్ చేస్తే
మన బుక్ షెల్ఫ్ కీ చేరు తుంది, అంటే మనం తర్వాత చాడువాలనుకున్నవన్నీ ఈ బుక్ షెల్ఫ్ లో పెట్టుకోవచ్చు
Bookshelf లో చేర్చే సమయం లో దానికి కేటగిరీ కూడా ఇవ్వవచ్చు
Save to Offline Library : ఇది క్లిక్ చేస్తే
ఆ కథ ఆఫ్ లైన్ లైబ్రరి కీ సేవ్ అవుతుంది, అంటే ఒక సారి సేవ్ చేసుకున్నాక ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా చదువుకోవచ్చు
మెనూ లో Readalong ఉన్నట్లయితే అది క్లిక్ చేస్తే కథ చదివి వినిపిస్తుంది
ఈ ఆర్టికల్ లో రీడింగ్ వరకు చెప్పుకున్నాము, ఇక రెండవ భాగం లో
2. Translate :కథ లను అనువదించడం
3. Create : కొత్త కథ తయారు చేయడం
4. Resources : వెబ్సైట్ లోని వనరులు
లను గురించి తెలుసుకుందాం
అన్నీ భాగాల పూర్తి వీడియో చూడండి
One thought on “కథలు అల్లుదామా! StoryWeaver – సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్ – Part 1”
Comments are closed.
Recent Posts
- Online Test Creator
- LearningApps -How to type Mathematical Equations & Expressions.. (Learning Apps Part 3)
- LearningApps -మ్యాప్ పాయింటింగ్ ఆప్ తయారు చేయడం .. (Learning Apps Part 2)
- LearningApps – ఇంటరాక్టివ్ టెస్ట్ ఆప్స్ ని సులభంగా తయారు చేసుకోండి ఇలా.. (Learning Apps Part 1)
- StoryWeaver లో కొత్త కథలను తయారు (Create) చేయడం ఎలా? – StoryWeaver Part3
Recent Comments
- A.Padmaja devi SGT Taranagar WSC school on కథలు అల్లుదామా! StoryWeaver – సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్ – Part 1
Super sir