StoryWeaver లో కొత్త కథలను తయారు (Create) చేయడం ఎలా? – StoryWeaver Part3

April 22, 2021 0 Comments

StoryWeaver –  సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్  Part 3

మొదటి  భాగం లో మనం StoryWeaver వెబ్సైట్ లో ఏమేముంటాయి, వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ,కథలను చదవడం లో ఏమేమున్నాయి, కథలను ఆఫ్ లైన్ లో చదవడానికి ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే బుక్ షెల్ఫ్ లో పుస్తకాలను ఎలా చేర్చుకోవాలి మొదలైన అంశాలను గురించి నేర్చుకున్నాము.

మొదటి భాగం  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అలాగే  రెండవ భాగం లో ఉన్న కథలను మన భాషలోకి ఎలా అనువాదించుకోవాలి అనేది తెలుసుకున్నాము,

రెండవ భాగం  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ భాగం వీడియో  పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇప్పుడు ఈ భాగం లో  StoryWeaver లో  కొత్త కథలను తయారు చేయడం ఎలా? అనేది చూద్దాం!

 

ఈ భాగం లో వెబ్సైట్ లోని రెండవ అంశం “Create” గురించి నేర్చుకుందాం. 

 


లాగిన్ అయిన తర్వాత మనకు ముఖ్యంగా 4 అంశాలు కనిపిస్తాయి

1. Read  : కథ లను చదవడం
2. Translate :కథ లను అనువదించడం
3. Create : కొత్త కథ తయారు చేయడం
4. Resources : వెబ్సైట్ లోని వనరులు

ఇందులో రెండవ అంశం అయినటువంటి  CREATE క్లిక్ చేసినప్పుడు

ఈ క్రింది విండో వస్తుంది,

అందులో TO దగ్గర మనం ఏ  భాష లో కథ తయారు చేయాలనుకుంటున్నామో ఆ భాష ఎంచుకోవాలి 

ఆతర్వాత, BOOK Title దగ్గర మనం కథకు ఇవ్వాలనుకున్న పేరు రాయాలి,

తర్వాత కథ ఏ స్థాయి వారికోసంవ ఎంచుకోవాలి, అలాగే కథ పుస్తకం అడ్డంగా నా (Horizontal) లేదా నిలువుగా (Verticle) కావాలో ఎంచుకుని

కథకు చిత్రాలు (Images) జత చేసి తర్వాత కథ రాయలనుకుంటే Start with Images  అనే బటన్ క్లిక్ చేయాలి లేదా

కథ రాసిన తర్వాత చిత్రాలు జతచేయాలనుకుంటే Start with words అనే బటన్ క్లిక్ చేయాలి

 

నేను  Start with Images  అనే బటన్ క్లిక్ చేస్తున్నాను, ఇది క్లిక్ చేయగానే

ఈ క్రింది Image Browswer  వస్తుంది.

ఇందులోనుంది మనం మనకు కావాల్సిన images ని Browse చేసుకోవచ్చు   లేదా ఒక్కొక్కటిగా ఎంచుకుని మన Favorites లో చేర్చుకుని తర్వాత వాటిని వాడుకోవచ్చు, లేదా మన స్వంత images  ని Upload చేయవచ్చు

Browse All images తీసుకుంటే అందులో వచ్చే images  ని డైరెక్ట్ గా మన కథలోకి insert చేసుకోవచ్చు,  అందుకోసం  image పైకి మౌస్ తీసుకెళ్ళి, add to current page అనే బటన్ క్లిక్ చేయాలి

images ని favourites లోకి చేర్చుకుని తర్వాత కథలోకి చేర్చుకోవలంటే image పైన ఉన్న save to favourites బటన్ క్లిక్ చేయాలి ఆ ఇమేజ్ favourites లోకీ చేరుతుంది,

తర్వాత favourites లోనుండి మన పేజీ లోకి తీసుకోవచ్చు.

మరొక ఆప్షన్ మన స్వంత images ని upload చేసుకొని వాడుకోవచ్చు

ఈ విధంగా image మన పేజీ లోకి చేర్చే సమయం లో ఆ image ని crop లేదా resize  చేసుకుని కావాల్సినంత మాత్రమే తీసుకోవచ్చు

ఈ విధంగా ఇమేజ్ చేర్చుకున్న తర్వాత, ఇమేజ్ క్రింద ఉన్న బాక్స్ లో కథ స్క్రిప్ట్ టైప్ చేయాలి.

కథ ను తయారు చేసే విండో లో ఏమేముంటాయో చూడండి

ఇందులో

కొత్త పేజీ చేర్చడానికి + బటన్

images చేర్చడానికి Image Browser  లేదా ఇమేజ్ బటన్ 

ఇమేజ్ ని Crop చేయడానికి crop బటన్

పేజీని డిలీట్ చేయడానికి డిలీట్ బటన్ ఉంటాయి

ఇంకా ఎడమవైపు చూసినట్లయితే,

కొత్త పేజీ లను చేర్చడానికి Insert Page(s) 

అలాగే ఉన్న పేజీ ని డూప్లికేట్ చేసుకుని కొత్త పేజీగా వాడుకోడానికి Duplicate బటన్

అలాగే పేజీ డిలీట్ చేయడానికి బటన్ ఉంటాయి

అలాగే మన పుస్తకం ఎలా ఉండాలో 6 లే ఔట్ లు ఉంటాయి,

 

 

ఇంకా Text Format ,

Background ,

Insert లో Textbox లేదా Callout Bubble 

చేర్చడానికి అవకాశం ఉంటుంది.

 

 

 

 

 

ఈ విధంగా కొంత బాగం తయారు చేసిన తర్వాత మధ్యలో ఆపాలంటే, SAVE బటన్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు , మళ్ళీ అది Dashboard లో ఓపెన్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు 

కథ పూర్తి అయినట్లైతే PUBLISH బటన్ క్లిక్ చేసినట్లైతే కథ అందరికీ అందుబాటులోకి వస్తుంది.

కథ పూర్తి కాకముందే అది ఎలాఉంటుందో చూడాలనుకుంటే Preview బటన్ క్లిక్ చేసి చూసుకోవచ్చు

ఈ విధంగా మన స్వంత కథలను తయారు చేసుకుని అందరికీ అందుబాటులో ఉండేలా చేసుకోవచ్చు, వీటిని షేర్ చేయవచ్చు, ఆఫ్ లైన్ లైబ్రరి లో చేర్చుకుని తర్వాత చదువుకోవచ్చు, కావాలంటే PDF రూపంలో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పిల్లలకు ఇవ్వవచ్చు.

ఈ విధంగా చాలా సులభంగా మనం కథలను తయారు చేసుకోవచ్చు.

ఇంకా వెబ్సైట్ లో ని RESOURCES  చూసినట్లయితే, అందులో

రెండు ముఖ్య విభాగాలు ఉంటాయి,

గ్రేడ్ 1 నుండి 8 వరకు

1. Reading Programme  – ఇందులో వేర్వేరు స్థాయిలకు తగ్గట్లు గా వేర్వేర్ భాషలలొ పిల్లలకు అవసరమయ్యే పుస్తకాలను New Readers, Early Readers, Middle Readers మరియు Advanced Readers లకు  ప్రోగ్రామ్ ఆధారం గా పుస్తకాలను  సెట్ లు గా చేసి పెట్టారు.

2.Books List – ఇందులో కూడా వేర్వేరు స్థాయిలకు తగ్గట్లు గా వేర్వేర్ భాషలలొ పిల్లలకు అవసరమయ్యే పుస్తకాలను New Readers, Early Readers, Middle Readers మరియు Advanced Readers లకు అంశం ఆధారంగా  పుస్తకాలను సెట్ లు గా చేసి పెట్టారు

ఈ విధంగా StoryWeaver ఉపాద్యాయులకు , విద్యార్థులకు అందరికీ ఒక అద్భుతమైన వెబ్సైట్.

అన్నీ భాగాల పూర్తి వీడియో చూడండి