LearningApps -మ్యాప్ పాయింటింగ్ ఆప్ తయారు చేయడం .. (Learning Apps Part 2)

సులభంగా ఆప్స్ ని తయారు చేసుకునే LearningApps.Org ని గురించి పార్ట్ -1 లో చెప్పుకున్నాము అది చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఈ భాగం లో LearingApps ఉపయోగించి Map Pointing App ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం
ఈ భాగం వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ముందుగా Create App క్లిక్ చేయాలి
తర్వాత వచ్చే విండో లో 22 రకాల ఇంటరాక్టివ్ అప్ప్స్ టెంప్లేట్స్ కనిపిస్తాయి
అందులో Matching Pairs on Images అనే టెంప్లేట్ పై క్లిక్ చేయాలి
ఇప్పుడు వచ్చే విండో లో Examples తీసుకోవచ్చు లేదంటే Create new App బటన్ ని క్లిక్ చేయాలి
ఇప్పుడు App Title మరియు App description ఇవ్వాలి
ఆ తర్వాత Background Image (అంటే మన మ్యాప్ ఇమేజ్ ) ఇవ్వడానికి Select Image బటన్ క్లిక్ చేసి ఇమేజ్ తీసుకోవాలి
ఇందులో వచ్చే 3 ఆప్షన్ లలో Search ద్వారా క్రియేటివ్ కామన్స్ ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు
ఇందులో మనకు కావాల్సిన మ్యాప్ వెదికి , దాన్ని క్లిక్ చేసి
use this అనే బటన్ క్లిక్ చేయాలి
ఇప్పుడు Marks on the Images లో మన మ్యాప్ పై ఏ ఏ ప్రదేశాలలో Point చేయాలో అక్కడ మార్కర్
పెట్టడానికి Place marker అనే బటన్ క్లిక్ చేసి
కావాల్సిన కలర్ మార్కర్ తీసుకుని దాన్ని కావాల్సిన ప్రదేశం లో పెట్టి Save బటన్ క్లిక్ చేయాలి
ఇప్పుడు ఆ పాయింట్ కి ఇవ్వాల్సిన జవాబు (Answer) Text గా గానీ, Image గా గానీ, Text to Speech గా గానీ,Audio గా గానీ, Video గా గానీ, ఇవ్వవచ్చు
మనం Text ఇవ్వడానికి Text అనే బటన్ కీ క్లిక్ చేసి అక్కడ జవాబు ఇవ్వాలి
ఇప్పుడు మరొక పాయింట్ పెట్టడానికి,
Place marker అనే బటన్ క్లిక్ చేసి
కావాల్సిన కలర్ మార్కర్ తీసుకుని దాన్ని కావాల్సిన ప్రదేశం లో పెట్టి Save బటన్ క్లిక్ చేయాలి
ఆ తర్వాత జవాబుగా Text గా గానీ, Image గా గానీ, Text to Speech గా గానీ,Audio గా గానీ, Video గా గానీ, ఇవ్వవచ్చు
ఇలా అన్నీ పాయింట్స్ ఇవ్వడం పూర్తి చేసుకున్నాక,
విద్యార్థి బాగా చేస్తే మెచ్చుకోడానికి ఏం చెప్పాలో Feedback బాక్స్ లో రాయాలి
విద్యార్థికి ఏదైనా Hint ఇవ్వాలనుకుంటే Help బాక్స్ లో టైప్ చేయాలి
Finsh editing and show preview బటన్ క్లిక్ చేయాలి
ఇప్పుడు వచ్చే విండో లో Save App బటన్ క్లిక్ చేయాలి
ఇప్పుడు ఆప్ మన అకౌంట్ లో సేవ్ అవుతుంది.
విద్యార్థులతో ఈ ఆప్ ని షేర్ చేయడానికి
ఈ విండోలో కుడివైపున క్రింద బాగాన ఉన్న లింక్స్ కాపీ చేసుకుని పంపవచ్చు,
QR Code పై క్లిక్ చేసి దాన్ని స్కాన్ చేయడం ద్వారా కూడా ఆప్ ని షేర్ చేయవచ్చు
ఈ ఆర్టికల్ వీడియో చూడండి
Recent Comments